కృష్ణా: శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు చల్లపల్లిలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభించారు. సోమవారం తొలిరోజు అమ్మవారికి కమిటీ ఆధ్వర్యంలో వాసవి మాతగా విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద నుంచి కమిటీ పెద్దలు, భక్తులు అమ్మవారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. సంఘ పెద్దలు అన్నవరపు పాండురంగారావు, కొల్లిపర నాగ పోతరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.