Chiruపై బాలయ్య సెటైర్స్.. సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అంటూ పోస్టర్
మెగాస్టార్ చిరంజీవిని బాలయ్య ఓ పోస్టర్లో టార్గెట్ చేశారు. తన మూవీ వీరసింహారెడ్డి సింగిల్ హ్యాండ్‌తో 100 రోజులు పూర్తి చేసుకుందని అందులో ప్రస్తావించారు.
Chiru-Balayya:సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’- బాలకృష్ణ (Balakrishna) ‘వీరసింహారెడ్డి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రెండింటీలో బాలయ్య మూవీనే ఆడింది. చిరు (chiranjeevi) సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. వాల్తేరు వీరయ్యలో రవితేజ (ravi teja) నటించిన.. ఇతర మసాలాలు జోడించిన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాలయ్య మూవీకి సంబంధించిన పోస్టర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో చిరంజీవిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.
‘సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్’ ‘ఎన్బీకే రోరింగ్ బ్లాక్ బస్టర్’ అని పోస్టర్ మీద రాసి ఉంది. బాలయ్య మూవీ విజయవంతంగా వందరోజులు పూర్తి చేసుకుంది. అందుకోసమే పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో బాలయ్య (balayya) గర్జించారు.. సింగిల్ హ్యాండ్‌తో సెంచరీ కొట్టారు అని మెన్షన్ చేశారు. వాల్తేరు వీరయ్య మల్టీస్టారర్ అయినప్పటికీ సక్సెస్ కాలేదని ఇండైరెక్టుగా ప్రస్తావించారు.
ఇదివరకు కూడా ఇలా పోస్టర్స్ (posters) వెలిశాయి. గతంలో అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు మూవీస్ కూడా పోస్టర్స్ కనిపించాయి. ఇప్పుడు మరోసారి వెలుగుచూశాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ (mythri movie makers) నిర్మించారు. ఓకే సంస్థ తీసినప్పటికీ పోస్టర్ రావడం ఆశ్చర్యం కలిగించింది. ఈ పోస్టర్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ఆన్ లైన్లో రిలీజ్ చేయలేదు. ఔట్ డోర్ వాల్ పోస్టర్స్ మాత్రం కనిపించాయి. అందుకే చర్చకు దారితీసింది.