PLD: డ్రాగన్ షూటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బెల్ట్ టెస్ట్ కరాటే పోటీలు ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ కోమటినేని శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి విద్యార్థులతో ఆటలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి 200 మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొన్నారు.