Heat wave:తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణ (telangana) రాష్ట్రంలో 13 జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. వడగాలులతో నలుగురు (four died) చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ (andhra pradesh) హై టెంపరేచర్ నమోదవుతుంది.
విశాఖపట్టణం (vizag), కోనసీమ (konaseema), ఎన్టీఆర్ (ntr), కృష్ణా (krishna), గుంటూరు (guntur), బాపట్ల (bapatla), శ్రీకాకుళం (srikakulam), కాకినాడ (kakinada), విజయనగరం (vizianagaram), అనకాపల్లి (anakapally), పల్నాడు (palnadu) జిల్లాల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వేడిగాలులు వీస్తాయని.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. టెంపరేచర్ 42 డిగ్రీలు దాటొచ్చు అని పేర్కొంది.
ఇటు దేశ రాజధాని ఢిల్లీలో (delhi) కూడా ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా 5 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ (prayag raj), హమీర్‌పూర్‌లో 44.2 డిగ్రీలు, రాజస్థాన్ చిత్తోర్‌గఢ్‌లో 43.2, కోటాలో 44.2, బన్సవారాలో 42.7, అల్వార్‌లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. పాట్నాలో 44.1, ఫేక్ పూర్లో 44.4 టెంపరేచర్ రికార్డైంది. వచ్చే రెండు, మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ఇటు పంజాబ్ (punjab), హర్యానా (haryana), జమ్ముకశ్మీర్ (jammu kashmir), హిమాచల్ ప్రదేశ్‌లో (himachal pradesh) దట్టమైన మేఘాల కదలికలు కనిపిస్తున్నాయి. మూడు, నాలుగు రోజుల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ చల్లని కబురు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టెంపరేచర్ తగ్గే అవకాశం లేదట.