వేసవి ప్రారంభంలోనే ఎండలు హీటు పుట్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడి గాలులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
వేసవి(Summer) ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత(HeatWave) రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రత్తలు(Temperature) నమోదవుతున్నాయి. పగటి పూట 40 నుంచి 43 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలోని పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు అధికంగా వేడి గాలులు(HeatWave) వీస్తాయని ఐఎండీ(IMD) హెచ్చరించింది. ఏప్రిల్ 18, 19వ తేదీల్లో అధిక ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాల్లో గరిష్టంగా 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవ్వనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక సిక్కిం, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలుల(HeatWave) తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది.
ఇకపోతే తెలుగురాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్(Andhrapradesh), తెలంగాణ(Telangana)లో కూడా భారీ ఉష్ణోగ్రతలు(Temperature) నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తాలో అధిక ఎండలు ఉంటాయని, చాలా ప్రాంతాల్లో వేడిగాలులు(HeatWave) వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. రాయలసీమ(Rayalaseema) జిల్లాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ(Telangana)లోని చాలా ప్రాంతాల్లో వేడిగాలులు(HeatWave) వీచే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలా బాద్, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో 44 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతాయని, సోమవారం నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది.