టాలీవుడ్(Tollywood) హీరో సాయిధరమ్ తేజ్(Saidharam Tej) నటిస్తున్న తాజా మూవీ విరూపాక్ష(Virupaksha). ఇదొక మిస్టరీ థ్రిల్లర్(Mystery Thriller) కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కార్తీక్ దండు(Karthik Dandu) డైరెక్షన్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో(Making Video)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది. ఈ మూవీ కోసం సాయిధరమ్ తేజ్, చిత్ర యూనిట్ ఎంత కష్టపడ్డారో మేకింగ్ వీడియో చూస్తేనే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్(Making Video Viral) అవుతోంది.
విరూపాక్ష మూవీ మేకింగ్ వీడియో :
ఇప్పటికే విరూపాక్ష సినిమా(Virupaksha Movie) నుంచి ‘నచ్చావులే నచ్చావులే’, ‘కలల్లో’ వంటి లిరికల్ వీడియో సాంగ్స్(Songs) విడుదల అయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. విరూపాక్ష నుంచి టీజర్(Teaser), టైటిల్ గ్లింప్స్, ట్రైలర్లు(Trailer) విడుదలై సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమాలో అఘోరా గుహల మేకింగ్ విజువల్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ఊరి జనాలకు ఏ సమస్య వచ్చింది, సాయిధరమ్ తేజ్(Saidharam Tej) ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడనేదే ఈ సినిమా కథాంశం. విరూపాక్ష సినిమా(Virupaksha Movie)కు కాంతార ఫేం అంజనీశ్ లోక్ నాథ్ సంగీతం(Music) అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ వంటివారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హీరోయిన్గా సంయుక్తా మీనన్(Samyuktha Menon) నటిస్తోంది.