KBC 15 నమోదు ప్రక్రియ ఏప్రిల్ 29నుంచి మొదలు కానుంది. ఈ రిజిస్ట్రేషన్ sms ద్వారా లేదా soni liv యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మళ్లీ బుల్లితెరపై సందడి చేయనున్నారు
KBC Season 15: బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. భారతీయ టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్ ప్రోగ్రామ్ తిరిగి మొదలుకాబోతుంది. ఇందుకు సంబంధించి సోనీ ఎంటర్టైన్మెంట్ ప్రోమో విడుదల చేసింది. దీనిలో కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 15 కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 29 నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ఆసక్తి గల వారు సోనీ లివ్ యాప్(SonyLiv) ద్వారా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫోను ద్వారా SMS పంపి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 29 నుండి రోజూ రాత్రి 9 గంటలకు తెరపై ఒక ప్రశ్న కనిపిస్తుంది. దానికి సరైన సమాధానం SMS ద్వారా లేదా యాప్ ద్వారా ఇవ్వాలి. సరైన సమాధానం చెప్పే వ్యక్తి కౌన్ బనేగా కరోడ్‌పతిలో అమితాబ్ బచ్చన్ ముందు ఉన్న హాట్ సీట్లో కూర్చునే అవకాశం లభిస్తుంది.
SMS లేదా Sony Live యాప్ ద్వారా ఎలా నమోదు చేసుకోవచ్చో తెలుసుకుందాం
మొదట SonyLiv యాప్ ద్వారా.. Step 1: ముందుగా Play Store లేదా App Storeకి వెళ్లి SonyLiv యాప్‌ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. Step 2: ఫోన్లో యాప్‌ను ప్రారంభించి, KBC లింక్‌పై క్లిక్ చేయండి. Step 3:స్క్రీన్ పై ఒక ప్రశ్న కనిపిస్తుంది. Step 4: ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. Step 5: అక్కడ కనిపించే ఫారంలో వ్యక్తిగత వివరాలను పూరించి సబ్మిట్ చేయాలి.
‘మీ KBC రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేసినందుకు ధన్యవాదాలు’ స్క్రీన్‌పై కనిపించినప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తయిందని అర్థం.
SMS ద్వారా .. Step 1: అమితాబ్ బచ్చన్ సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రశ్నలు అడుగుతారు. దీన్ని ఏప్రిల్ 29 నుండి టీవీలో చూడవచ్చు. Step 2: జియో నంబర్ కాకుండా, వేరే నెట్వర్క్ నంబర్ ఉంటే SMS పంపడానికి 3 రూపాయలు ఖర్చు అవుతుంది. Step 3: నిర్ణీత సమయంలో ప్రశ్నకు సమాధానమిచ్చి పంపండి. Step 4: Airtel, BSNL, VI, Jio కస్టమర్లు 509093కి SMS పంపడం ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చు.
SMS ఫార్మాట్ ఇలా ఉంటుంది: KBC, ఎంపిక A, B, C లేదా D, వయస్సు, లింగం
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఆన్లైన్ ఆడిషన్‌కు హాజరు కావాలి. మీరు SonyLIV యాప్ ద్వారా ఈ ఆడిషన్ ఇవ్వవచ్చు. షార్ట్‌లిస్ట్ అయితే వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం KBC బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది.
మీరు సోనీ లివ్ వెబ్సైట్ http://www.sonyliv.comవెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. KBC నమోదు చేసుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని KBCలో ఎంట్రీ ఫీజు అడిగితే అది మోసమని గ్రహించండి.