Green Tea : గ్రీన్ టీ తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసం
ప్రస్తుతం ఆఫీసుల్లో, ఇళ్లలో గ్రీన్ టీ(Green Tea) తాగే వారి సంఖ్య పెరిగింది. మార్కెట్లో కూడా గ్రీన్ టీకి భళే డిమాండ్ నెలకొంది. గ్రీన్ టీ ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు, క్యాటెచిన్స్ వంటి బయోయాక్టీవ్ పాలిఫెనాల్స్(Bioactive polyphenols) చాలా ఉంటాయి.
Green Tea : గ్రీన్ టీ ఆరోగ్య నిధిగా పరిగణించబడుతుంది. కాబట్టి చాలా మంది ఆరోగ్య నిపుణులు దీనిని తాగాలని సిఫార్సు చేస్తున్నారు. మొన్నటి వరకు అందరూ చాయ్, కాఫీ తాగేవారు. కానీ కరోనా పుణ్యమాని.. ఇప్పుడు అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో అంతా గ్రీన్‌టీకి అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం ఆఫీసుల్లో, ఇళ్లలో గ్రీన్ టీ(Green Tea) తాగే వారి సంఖ్య పెరిగింది. మార్కెట్లో కూడా గ్రీన్ టీకి భళే డిమాండ్ నెలకొంది. గ్రీన్ టీ ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు, క్యాటెచిన్స్ వంటి బయోయాక్టీవ్ పాలిఫెనాల్స్(Bioactive polyphenols) చాలా ఉంటాయి. ఇవన్నీ యాంటీఆక్సిండెట్లే(Antioxidants). ఇవి ఫ్రీరాడికల్స్(Free radicals) డ్యామేజీని అరికడతాయి. అయితే, గ్రీన్ టీతో ప్రయోజనాలు ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు, లెక్కలేకుండా తాగడం కూడా అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
క్యాన్సర్ అనేది చాలా భయంకర వ్యాధి. గ్రీన్ టీ తాగడం ద్వారా దీనిని కొంత వరకు అదుపులో ఉంచవచ్చు. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ ట్యూమర్లు, క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్(bad cholesterol) స్థాయిని తగ్గిస్తుంది. అందువల్ల రక్తనాళాల్లోని అడ్డంకులను తగ్గిస్తుంది. గుండె జబ్బుల(Heart disease) ప్రమాదాన్ని నివారిస్తుంది. గ్రీన్ టీ చర్మ వ్యాధుల నుండి చాలా రక్షణను కలిగిస్తుంది. శరీరంపై ఏర్పడే మొటిమలను పోగొడుతుంది. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను పెంచుతాయి. బరువు(Weight) తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో కొవ్వు క్రమంగా తగ్గుతుంది. వ్యాయామానికి ముందు తాగడం మంచిది.
గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి?
భోజనానికి గంట ముందు గ్రీన్ టీ తాగడం మంచింది. ఎందుకంటే ఇందులో టానిన్లు ఉంటాయి. తిన్న వెంటనే గ్రీన్ టీని తీసుకోవద్దు. కారణం ఇది వికారం, మలబద్ధకం(Constipation), కడుపు నొప్పిని కలిగిస్తుంది. ఎప్పుడూ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగొద్దు. దానితో ఏదైనా తినుకుంటూ తాగొచ్చు. రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే, అది శరీరానికి హానిని కలిగిస్తుంది. పడుకునే ముందు దీన్ని తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు.