AP: రాష్ట్రంలో ఈ ఏడాది ఉల్లి పంట బాగా దిగుబడి వచ్చినా.. ధర లేక రైతులు తంటాలు పడుతున్నారు. వ్యాపారులు దోచుకుంటున్నా.. మార్క్ ఫెడ్ అధికారులు మౌనంగా ఉన్నారు. కిలో 30 పైసలకు అడుగుతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 15.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి రాగా.. గతేడాది క్వింటా రూ.5 వేలు పలికింది. ప్రస్తుతం క్వింటా రూ.500 లోపే కాగా, CM ఆదేశాలతో క్వింటా రూ.1200లకు కొనుగోలు చేస్తున్నారు.