MBNR: జిల్లా కేంద్రంలోని స్టేట్ హోమ్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిరా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్టేట్ హోమ్‌లో ఉన్న వారందరినీ పేరు పేరునా పలకరిస్తూ ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోక్సో యాక్ట్, చైల్డ్ మ్యారేజెస్,లీగల్ సర్వీసెస్ యాక్ట్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు