కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార 1’ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 22న మధ్యాహ్నం 12:45 గంటలకు ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది.