‘లిటిల్ హార్ట్స్’ మూవీ సక్సెస్ మీట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్.. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా సమయంలో తన వద్ద డబ్బులు లేవని అన్నారు. దాని ప్రమోషన్స్‌లో పాల్గొనడానికి కాస్ట్యూమ్స్ వాళ్ల దగ్గర డ్రెస్సులు తీసుకునివెళ్లేవాడిని అని తెలిపారు.