»Cm Jagan Participated In Iftar Dinner In Vijayawada
Iftar feast : విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
సీఎం జగన్ (CM Jagan) ముస్లిం సోదరులకు రంజాన్ (Ramadan)శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని సూచించారు. విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు.
రంజాన్ (Ramadan) మాసం సందర్బంగా ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం జగన్ (CM Jagan) పాల్గొన్నారు.విజయవాడ (Vijayawada) విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మంది హాజరయ్యారు. ముస్లిం టోపీ, పవిత్ర కండువా ధరించి ముస్లింలతో కలిసి నమాజ్ ఆచరించారు. రంజాన్ సమీపిస్తున్న నేపథ్యంలో, ముస్లింలకు సీఎం జగన్ (CM Jagan) శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని సీఎం పిలుపునిచ్చారు. మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కోన్నారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్టు వివరించారు. ఏపీ ప్రభుత్వ ఇఫ్తార్ విందు(Iftar feast)కు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా (Deputy CM Anjad Basha) మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో మైనారిటీల(minorities)కు ఎంతో మేలు జరిగిందని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వం మైనారిటీలను పట్టించుకోలేదని అంజాద్ బాషా విమర్శించారు. మైనారిటీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత సీఎం జగన్ (CM Jagan) దేనని కొనియాడారు.