KMM: సృష్టికర్త విశ్వకర్మ జయంతి వేడుకలు ఖమ్మంలోని గాంధీ చౌక్ ఆలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. తమ వృత్తి నైపుణ్యాన్ని, శ్రమను గౌరవిస్తూ విశ్వబ్రాహ్మణులు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ యర్రం బాలగంగాధర్ తిలక్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.