HYD: గోల్కొండ హనీట్రాప్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజినిని 2రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఒక మహిళా నిందితురాలు బెయిల్పై బయటకు వచ్చారు.