హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన షరీఫ్ ఉద్దీన్(27) అనే వ్యక్తి బల్కంపేట రైల్వే అండర్ బ్రిడ్జి కింద గల్లంతయ్యారు. నిన్న కురిసిన భారీ వర్షానికి బల్కంపేట వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలో ఉన్న ఈ అండర్ బ్రిడ్జి కింద భారీగా వరదనీరు నిలిచిపోయింది. రాత్రి 11 గంటల సమయంలో బైక్‌పై తన ఇంటికి వెళ్తున్న షరీఫ్.. బైక్ అదుపుతప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.