SRPT: నడిగూడెం మండల కేంద్రంలో సాయిధ పోరాట వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలోనే మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ఇవాళ అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఇటీవల మరణించిన తొలితరం నాయకుడు వెంపటి అప్పారావు సేవలను గుర్తు చేసుకున్నారు. సాయుధ పోరాటాలను నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.