KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసిలోని పత్తి పొలాలను ఏడీఏ మహమ్మద్ ఖాద్రీ సోమవారం పరిశీలించారు. అధిక వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పత్తి పంట నీటి ముంపునకు గురైనప్పుడు ఆకులు ఎర్రబడటం, మొక్కలు వాడిపోవడం, కాయలు కుళ్లిపోవడం జరుగుతుందన్నారు. నీటి ముంపు పరిస్థితి ఉన్నప్పుడు మురుగు నీటిని తొలగించాలని సూచించారు.