E.G: రాజమండ్రి సిటీ కాపునాడు యువజన విభాగం అధ్యక్షుడిగా సింహాద్రి వీర వెంకట దుర్గా ప్రసాద్‌ను గురువారం నియమించారు. దేవీ చౌక్‌లోని కాపునాడు కార్యాలయంలో ఈ నియామక ప్రకటన చేశారు. ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘు నరేశ్ సమక్షంలో పార్లమెంట్ విభాగం అధ్యక్షుడు ముమ్మిడి వీరబాబు నియామక పత్రాన్ని అందజేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వారు సూచించారు.