NLR: అంగన్వాడీ కార్య కర్తలపై గతంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. ‘మా కోవూరులో యానాది తెగకు చెందిన 138 గిరిజన కాలనీల్లో 35వేల మంది ఉన్నారు. మొత్తం 407 అంగన్వాడీలు ఉండగా 212 అద్దె భవనాల్లో ఉన్నాయి. వీటికి కొత్త బిల్డింగ్లు కట్టించాలి’ అని ఆమె కోరారు.