W.G: బ్రాహ్మణ చెరువులోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మి విద్యార్థులకు హిమోగ్లోబిన్, ఎత్తు, బరువు పరీక్షలు చేశారు. పిల్లల వయసు ఆధారంగా టీటీ, డీపీటీ వంటి ఇంజెక్షన్లు వేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ స్వాతి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.