ATP: రాయదుర్గం మండల పరిధిలోని ఉడేగోళం క్రాస్ వద్ద గురువారం 10 ఇసుక టాక్టర్లను సీజ్ చేసినట్లు అర్బన్ సీఐ జయ నాయక్ వెల్లడించారు. రాయదుర్గం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎటువంటి ధృవపత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తుండగా పట్టుకుని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. నియమ నిబంధనలు పాటించకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.