సత్యసాయి: పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లి వైసీపీ నాయకుడు, మండల ఉపాధ్యక్షులు చెన్నకేశవులు భార్య లక్ష్మీదేవమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు శంకర్ నారాయణ, ఉషశ్రీ చరణ్ గురువారం వారి గ్రామానికి వెళ్ళి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.