‘కాంతార 1’ సినిమాను థియేటర్లలో చూసే వారు మద్యం తాగకూడదు.. మాంసం తినకూడదు. సిగరెట్ తాగకూడదు అంటూ ఓ పోస్టర్ వైరల్ అయింది. దీంతో ఈ సినిమాపై వివాదం నెలకొంది. తాజాగా ఈ అంశంపై నటుడు రిషబ్ శెట్టి స్పందించారు. ఆ పోస్టర్‌తో తమకు సంబంధం లేదన్నారు. అది ఫేక్ పోస్టర్ అని, అలాంటి రూల్స్ ఏమీ లేవని పేర్కొన్నారు.