సత్యసాయి: సోమందేపల్లి మండలం మాగేచెరువులో మాజీ ఎంపీటీసీ రామాంజనేయులు మాతృమూర్తి నాగమ్మ గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాగేచెరువు సర్పంచ్ నరసింహులు, మాజీ మండల కన్వీనర్ సిద్దలింగం, సింగల్ విండో ప్రెసిడెంట్ వెంకటేశులు వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.