NLG: పెండింగ్లో ఉన్న 2564 సదరం కేసులను వచ్చే నెలలోపు పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి డీఆర్డీవో శేఖర్ రెడ్డిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరాన్ని ఆమె గురువారం సందర్శించారు. పార్టీషన్ పనులను పూర్తి చేసి, ఇకనుంచి సదరం క్యాంపులను ఆసుపత్రి నూతన భవనంలో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.