KMM: డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాల గడువు ఈ నెల 26 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ డాక్టర్ చీపు పూర్ణచంద్రరావు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలు సత్తుపల్లిలోని స్టడీ సెంటర్లో జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.