NDL: భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థలు, వసతి గృహాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఆమె కోరారు. భూసేకరణలో సమన్వయం అవసరం జిల్లా అభివృద్ధి, పారిశ్రామిక పురోగతికి, సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణకు భూసేకరణ కీలకమని కలెక్టర్ తెలిపారు.