ఇకపై ప్రకృతి వ్యవసాయంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను భక్తులకు ఇవ్వనున్నట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.
తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala tirupathi Devasthanams) శ్రీవారి ప్రసాదంపై కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం టీటీడీ(TTD) పాలక మండలి సమావేశం నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో పాలక మండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి(Tirupathi)లో శ్రీనివాస సేతు(Srinivasa setu)ను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఢిల్లీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహాలోనే బ్రహ్మోత్సవాలు(Bramhotsavams) నిర్వహించాలని పాలక మండలి నిర్ణయించింది.
తిరుమల(Tirumala) ప్రసాదంపై కూడా టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను కొనుగోలు చేయాలని, శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే పదార్థాలతోనే చేయాలని నిర్ణయించింది. టీటీడీ నిర్ణయంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ(TTD) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇకపై భక్తులకు ప్రకృతి వ్యవసాయంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను టీటీడీ(TTD) అందించనుంది. అలాగే టీటీడీ ఈ గోడౌన్లలో కోల్డ్ స్టోరేజీ ఆధునీకరణకు రూ.14 కోట్లు, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి మరో రూ.12 కోట్లను టీటీడీ కేటాయించింది. అదేవిధంగా తిరుపతి విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగిస్తూ, అవసరమైతే శాశ్వత ఉద్యోగులను నియమించాలని టీటీడీ(TTD) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.