E.G: రాజమండ్రి నగరంలోని గోదావరి గట్టున ఉన్న క్షేత్ర పాలకుడు వేణు గోపాల స్వామి ఆలయాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.