సత్యసాయి: తిరుపతిలోని తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారిని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి వెళ్లిన ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వాదాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె తిరుపతిలో జరుగుతున్న జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్నారు.