TG: ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియలో జాప్యంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదని అందుకే సమ్మె చేయడానికి సిద్ధమైనట్లు తెలిపింది. బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రులను నడిపించే పరిస్థితి లేదని ప్రైవేట్ హాస్పిటల్స్ వెల్లడించాయి.