ADB: భీంపూర్ మండలం అంతర్గావ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ముకుంద్ పాముకాటుకు గురయ్యారు. తన వ్యవసాయ పొలంలో పనిచేసే సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందజేసినట్లు వెల్లడించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న EMT దత్తు, సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.