HNK: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఉన్న వందేళ్ల శివాలమర్రి వృక్షం ఆదివారం కూలిపోయింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా చెట్టు నేలకొరిగింది. మల్లన్న దర్శనానికి ముందు భక్తులు ఈ చెట్టుకు పూజలు చేయడం ఆనవాయితీగా భావిస్తారు. మల్లన్నకు పవిత్రమైన రోజునే కూలడంపై భక్తులు ‘శివోహం’గా భావిస్తున్నారు.