PDPL: రామగుండం ఏరియా–1 అద్దె వాహనాల యజమానుల అసోషియేషన్ అధ్యక్షుడు తోట సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో అసోసియేషన్ యజమానులు రూ.లక్ష విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆదివారం మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు రూ.లక్ష విలువైన చెక్కును అందజేశారు. సమ్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దెబ్బెట మల్లేష్, సదానందం, పాల్గొన్నారు.