E.G: గోదావరికి వరద ఉదృతి మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మూడోసారి గౌతమి, వశిష్ట నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద పెరగడంతో ఆయా లంక ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లంక గ్రామాల్లోని ఉద్యాన పంటలు వరద నీటిలో మునిగిపోయి రైతులు నష్టాల బారినపడ్డారు. మళ్లీ వరద పెరగడంతో వారిలో ఆందోళన నెలకొంది.