TG: హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని మేయర్ విజయలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వర్షపు నీటిని మళ్లించాలని, మోటార్లతో నీటిని తొలగించాలని ఆమె అధికారులను ఆదేశించారు.