యాదాద్రి: కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్ఎఫ్బీఎప్ చెక్కులను అధికారులు పంపిణీ చేయాలని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గోపగాని ప్రసాద్ అన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఆయన మాట్లాడుతూ.. కుటుంబ పెద్ద మరణిస్తే రూ. 20 వేల ఆర్థిక సాయం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. లబ్ధిదారులకు సకాలంలో సహాయం అందించాలని ఆయన కోరారు.