HYD: మహ్మద్ గూడలో మైనారిటీ నాయకులు జాకీర్ నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో కార్పొరేటర్ డాక్టర్ సామలహేమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముహమ్మద్ ప్రవక్త బోధనలు శాంతి, ప్రేమ, ఐక్యతను చాటిచెప్పాయని అన్నారు. సమాజంలో మతం పక్కనపెట్టి అందరూ సోదరభావంతో ఉండాలని కోరారు. డివిజన్లోని పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.