SRCL: చందుర్తి మండలం సనువుల గ్రామ శివారులోని పెద్దమ్మ ఆలయం వద్ద ఈదురు గాలికి మర్రి చెట్టు కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో దేవుని తాండకు వచ్చే బస్సును సనుగుల గ్రామం వరకే నడుపుతున్నారు. దేవుని తండా జలపతి తండాలకి చెందిన ప్రజలు సనుగుల గ్రామం నుంచి తండాలకు నడిచి వెళ్తున్నారు. తాండవరకు నడిచి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.