అన్నమయ్య: కూటమి ప్రభుత్వంలోనే మదనపల్లె నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే షాజహాన్ భాష స్పష్టం చేశారు.ఇవాళ పట్టణం లో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ప్రమీల, కూటమి నాయకులు పాల్గొన్నారు.