SKLM: జిల్లా కలింగ వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా జామీ వెంకటరావును ఎన్నుకున్నారు. ఇటీవల నరసన్నపేటలో జరిగిన వైశ్య సంఘం జిల్లా కమిటీ సమావేశంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. కార్యవర్గాన్ని ఆదివారం ఉదయం రాష్ట్ర కళింగ వైశ్య సంఘ అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రధాన కార్యదర్శిగా వెంకటరావును ఎంపిక చేశారు.