W. G: దసరా నవరాత్రుల్లో భాగంగా ఆకివీడు శాంతినగర్ శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాటా మహోత్సవం ఆదివారం నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి తొమ్మిది రోజులు ఉత్సవాల నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, శాంతినగర్ ప్రజలు పాల్గొన్నారు.