AP: రాష్ట్ర స్థాయి 7వ రెవెన్యూ క్రీడోత్సవాలను నవంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. 26 జిల్లాల నుంచి వీఆర్ఏతో మొదలుకుని ప్రత్యేక ఉపకలెక్టర్ వరకు, సీసీఎల్ఏ యూనిట్ నుంచి ఉద్యోగులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ముగింపు రోజున సీఎం, రెవెన్యూ మంత్రి హాజరవుతారని చెప్పారు.