NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్లోని గొల్లపాలెంగట్టు, క్వారీ ప్రాంతంలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. తన్నీరు నరేంద్ర అనే వ్యక్తి ఇంటిపై కొండచరియలు, పెద్ద బండరాళ్లు విరిగిపడటంతో ఇల్లు బాగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.