KRNL: గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 14 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు రెండు గేట్లు (గేట్ నంబర్ 4, 5) ఎత్తి దిగువకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన హంద్రీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రాజేశ్వరి సూచించారు.