TPT: ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సన్నిహితులతో కలిసి శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి అతిథి భవనం వద్ద ఓఎస్వో సత్రే నాయక్ ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేసారు.