ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం విశాఖ పర్యటనకు వస్తున్నారు. 12న పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఏయూలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ టూర్కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెళతారా లేదా అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్ కు బ్రేకులు పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో ఈ రోజు రాత్రి 8.30గంలకు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. విశాఖ నగరంలో ఇఎన్ఎస్ చోళలో ఈ భేటీ జరగనుంది.
దాదాపు మూడేళ్ళ తర్వాత మోదీని పవన్ కళ్యాణ్ కలవనున్నారు. మోదీ రెండోసారి ప్రధాని గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అభినందన కోసం కలిసిన పవన్ ఆ తరువాత మళ్ళీ కలువలదు. గతంలో అజాది కా అమృత్ మహోత్సవ్ సన్నాహక సమావేశానికి, రాష్ట్రపతి ముర్ము ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆహ్వానించినా పవన్ కళ్యాణ్ వెళ్ల లేదు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ రోజు రాత్రి ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తారు. కంచర పాలెం నుంచి ఓల్డ్ ITI వరకు ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు రోడ్ షో ఉంటుంది. 11 రాత్రి INS చోళలో ప్రధాని బస చేస్తున్నారు. 12న 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.