నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆమెతో ప్రమాణం చేయించారు. కొంతమంది మంత్రులతో ఆమె కేబినెట్ సమావేశం నిర్వహించారు. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించి రికార్డు సృష్టించిన కర్కి.. ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగానూ ఆరుదైన ఘనత సాధించారు.