W.G: ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆచంట మండలం పెదమల్లం లంక రైతులకు పశువుల దాణాను శుక్రవారం అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు. గత కొన్ని రోజుల క్రితం గోదావరి వరదల కారణంగా పశువులకు దాణా కొరత తీవ్రమైంది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రైతులకు దాణాను అందించే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి ప్రభుత్వం నాయకులు పాల్గొన్నారు.